kalavenkatrao on ots: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి, ఇళ్ల పట్టాలు ఇస్తామని మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ఓటీఎస్ ద్వారా ప్రభుత్వం కొత్త దోపిడీకి తెర లేపిందని ఆయన మండిపడ్డారు. నగదు చెల్లించకపోతే పింఛన్, సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించటం ఏమిటని ధ్వజమెత్తారు. ఓటీఎస్ కోసం 10వేల రూపాయలు ఎవరూ చెల్లించవద్దన్నారు.
kalavenkatrao on ots: 'మేం అధికారంలోకి రాగానే.. ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్' - Kala Venkatrao
kalavenkatrao on ots: తెదేపా అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల పట్టాలు ఇస్తామని.. మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ఓటీఎస్ కోసం 10వేల రూపాయలు ఎవరూ చెల్లించవద్దన్నారు.
తెదేపా అధికారంలోకి రాగానే తిరిగి చెల్లించేస్తాం: యరపతినేని
పిడుగురాళ్ల తెదేపా కార్యాలయంలో తెదేపా నేత యరపతినేని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. లోన్లు ఇప్పించలేని ఇళ్లకు డబ్బులు కట్టాలని ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారులు వచ్చి డబ్బులు చెల్లించాలని అడిగితే.. ఎవరూ కట్టవద్దని తెలిపారు. తెదేపా అధికారంలోకి రాగానే అలా చెల్లించిన మెుత్తాన్ని తిరిగి చెల్లించేసి.. ప్రజలపై భారం పడుతున్న ఈ పథకాన్ని రద్దు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: