ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KALA VENKATRAO : 'కక్షలు, కుల రాజకీయాలకు స్వస్తి పలకాలి' - rekky on vangaveeti ranga

కక్షలు, ముఠా తగాదాలు, కుల రాజకీయాలకు స్వస్తి పలకాలని తెదేపా నేత కళా వెంకట్రావు అన్నారు. వంగవీటి రాధా తెదేపాలో ఉన్నారన్న అక్కసుతోనే రెక్కీ నిర్వహించారని ఆక్షేపించారు.

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు

By

Published : Dec 30, 2021, 9:30 PM IST

వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహిస్తే.. వైకాపా పాలకులు చర్యలు తీసుకోకుండా కట్టుకథలు చెబుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సామాజిక వర్గాలను రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

వంగవీటి రాధాపై రెక్కీ నిర్వహించడం బాధాకరమని, ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన వాడన్న ఉద్దేశంతోనే.. రెక్కీ నిర్వహించారని విమర్శించారు. కక్షలు, ముఠా తగాదాలు, కుల రాజకీయాలకు స్వస్తి పలకాలని కళా వెంకట్రావు హితవు పలికారు.

ఇదీచదవండి :

ABOUT THE AUTHOR

...view details