Kala Venkat Rao: రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం ఎందుకు సొంత నిధులు వెచ్చించడం లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని నిర్మాణానికి గతంలో రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకుల ముందుకు వచ్చాయన్న ఆయన.. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడానికి, సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చుకోవడానికి మాత్రం నిధులు ఉన్నాయా అని మండిపడ్డారు.
'రాజధానిపై దురుద్దేశం లేకుంటే.. నిర్మాణాలు ఎందుకు ఆపారు' - సీఎం జగన్పై తెదేపా నేత కళా వెంకట్రావ్ ఆగ్రహం
Kala Venkat Rao: రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం ఎందుకు సొంత నిధులు వెచ్చించట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. రాజధానిపై దురుద్దేశం లేకుంటే నిర్మాణాలు ఎందుకు ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు
కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే.. 78 శాతం పూర్తి చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,.. 69 శాతం పూర్తైన ఐఎఎస్,.. 72 శాతం పూర్తైన గెజిటెడ్ అధికారుల నివాసాలు పూర్తయ్యేవని తెలిపారు. రాజధానిపై ఈ ప్రభుత్వానికి దురుద్దేశం లేకుంటే ఆపేసిన నిర్మాణాలు ఎందుకు ప్రారంభించడం లేదని నిలదీశారు. రాజధానిలో తెదేపా నిర్మించిన 5,028 ఇళ్లను పేదలకు ఇవ్వాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Varla Ramaiah Letter: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ