దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు విద్యుత్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. జగన్ మాత్రం విద్యుత్ మీటర్లతో రైతుల మెడకు ఉరి బిగిస్తున్నారని తెదేపా నేత కళావెంకట్రావు విమర్శించారు. అప్పుల కోసం రైతులను చిదిమేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. పిచ్చోడి చేతిలో రాయిలా.. జగన్ ప్రభుత్వ నిర్ణయాలున్నాయని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ రంగాన్ని జగన్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందన్నారు.
విద్యుత్ మోటార్ల పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ఆక్షేపించారు. కేంద్రం ఇచ్చే 4 వేల కోట్ల అప్పు కోసమే మీటర్లని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేరోజు దగ్గరపడిందన్న కళా... పన్నులు పెంచి ఆదాయం సృష్టించాలనుకోవడం సిగ్గుమాలిన తనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ మీటర్ల వ్యవహారంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.