ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిపాలనలో వైఎస్​కు, జగన్​కూ తేడా లేదు: జవహర్ - tdp comments on ycp

రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెదేపా నేత జవహర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు, జగన్ పాలనకు పెద్ద తేడా లేదన్నారు.

tdp leader jawahar comments on ycp
తెదేపా నేత జవహర్‌

By

Published : May 4, 2020, 1:35 PM IST

వైఎస్ హయాంలో మద్యపాన నిషేధం అని చెప్పి రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని రూ.30 వేల కోట్లకు పెంచారని మాజీ మంత్రి జవహర్ గుర్తు చేశారు. బెల్ట్ షాపులను పెంచి పోషించారని విమర్శించారు. ఇప్పుడు వైఎస్ పాలనకు జగన్ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. మద్య నిషేధం చేస్తానని జగన్ మ్యానిఫెస్టోలో హామీనిచ్చారని... తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని... ఇష్టానుసారంగా రేట్లు పెంచారని మండిపడ్డారు. రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోందని సాక్షాత్తు స్పీకర్ చెప్పినా పట్టించుకోలేదని గుర్తుచేశారు.

కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నారు...

వైకాపా నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గంజాయి, నాటుసారా పంపిణీ జరుగుతున్నా సీఎం.. పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక వైపు నాటు సారా పంపిణీ.. మరో వైపు వైకాపా నాయకుల కంపెనీల నుంచి ఆల్కహాలు శాతాన్ని పెంచి కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వాలంటీర్లు సారా కాస్తున్నారని.... అధికారులే మద్యాన్ని అమ్ముకుంటున్నారని అన్నారు. లాక్ డౌన్ ముందు నుంచి ఉన్న మద్యం నిల్వలు.. ఇప్పుడున్న మద్యం నిల్వల లెక్క తేల్చి... శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

తెరుచుకున్న మద్యం షాపులు.. బారులు తీరిన మందుబాబులు

ABOUT THE AUTHOR

...view details