ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలోని మద్యం బ్రాండ్ల వివరాలు గూగుల్లోనూ దొరకట్లేదు: జవహర్ - విజయవాడ వార్తలు

రాష్ట్రంలో మద్యం ధరలపై మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ధరలు పెంచి ప్రజలపై సీఎం జగన్‌ అదనపు భారాన్ని మోపుతున్నారని మాజీ మంత్రి జవహర్‌ మండిపడ్డారు. .

tdp-leader-jawahar-comments-on-liquor
మాజీ మంత్రి జవహర్‌

By

Published : Sep 5, 2020, 12:06 PM IST

మద్యం ధరలు పెంచి ప్రజలపై సీఎం జగన్‌ అదనపు భారాన్ని మోపుతున్నారని మాజీ మంత్రి జవహర్‌ మండిపడ్డారు. కమీషన్ల కోసం.... ఎప్పుడూ చూడని కొత్త పేర్లతో నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమ్ముతున్న బ్రాండ్లు తాగేవారికే కాదు గూగుల్‌కే తెలియట్లేదని ఎద్దేవా చేశారు.

ప్రెసిడెంట్ మెడల్‌ అనే గౌరవ పదాన్ని మద్యం సీసాలకు పెట్టారని జవహర్ విమర్శించారు. మద్యం అమ్మకాల నుంచి వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. ఆ ధరలకు మద్యం కొనుగోలు చేయలేక శానిటైజర్‌, కల్తీ మద్యం, నాటుసారా తాగి పదుల సంఖ్యలో ప్రజలు కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు . రాష్ట్రంలో వైకాపా నేతలు మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని.... ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆగ్రహించారు.

ఇదీ చదవండి:ఆగని అక్రమ రవాణా.. భారీగా మద్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details