చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగ సంఘం నాయకుడా..లేక సీఎం జగన్ అనుచరుడా ? అని మాజీమంత్రి జవహర్ ప్రశ్నించారు. ఆయనకు స్వామిభక్తి ఎక్కువైతే..పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరవచ్చని హితవు పలికారు. ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తామనటంపై ఆయన మండిపడ్డారు. ఏ రెడ్డిని తృప్తిపరిచేందుకు అలా మాట్లాడారో చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయలేని వారికి ఎస్ఈసీ నిర్ణయాన్ని ధిక్కరించే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా పాఠశాలలు తెరిచినప్పుడు..ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడతారని తెలియదా? అని ప్రశ్నించారు.