ఇష్టారీతిలో పరిపాలన చేస్తూ.. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ కాలం గడపడం తప్ప, వైకాపా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు(farmer minister devineni comments on cm jagan) ధ్వజమెత్తారు. జగన్ హయాంలో అడ్డగోలుగా రేషన్ బియ్యం, అక్రమ మద్యం, పేకాట, గంజాయి స్మగ్లింగ్లతో వైకాపా నేతలు కోట్ల రూపాయాలు కొల్లగొడుతున్నారని దేవినేని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి, దొంగ కేసులు పెడుతూ ప్రతిపక్ష నేతలపై వేధింపులకు పాల్పడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వాహించిన మీడియా సమావేశంలో స్థానిక మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైకాపా అనాలోచిత నిర్ణయాలతోనే అథమ స్థానానికి ఏపీ: జవహర్
ముఖ్యమంత్రి జగన్.. అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం.. అథమ స్థానానికి పడిపోయిందని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు(farmer minister jawahar comments on ycp). రాష్ట్రంలో విద్యాసంస్థలు మూతపడి లక్షలాదిమంది విద్యకు దూరమయ్యేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని పేర్కొంటూ.. జగన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. "నూతన విద్యావ్యవస్థ, ఆంగ్లమాద్యమం, ఎయిడెడ్ వ్యవస్థ నిర్వీర్యం వంటి చర్యలతో గందరగోళం సృష్టించి ఉపాధ్యాయ రంగాన్ని అవహేళన చేశారు. పాఠశాలల అభివృద్ధి అంటే కమీషన్ల కోసం నాడు-నేడు నిర్వహించడం కాదు. అమ్మఒడి పేరుతో విద్యార్థులకు బోధనా రుసుములు చెల్లింపు ఎగ్గొట్టారు. ఎస్సీ విద్యర్థులకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాలను రద్దు చేశారు. సీపీఎస్ రద్దు, డీఎ పెంపు హామీలు విస్మరించి ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేశారు. ఇప్పటికైనా ఈ అంశాలపై ఆత్మపరిశీలన చేసుకుని, విద్యార్థులు, తల్లితండ్రుల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలి" అని లేఖలో పేర్కొన్నారు.
ప్రతిపక్షాల్ని భయపెడితే.. మాదకద్రవ్యాల సమస్య పరిష్కారం కాదు: ద్వారపురెడ్డి జగదీశ్
ప్రతిపక్షాల్ని భయపెడితే, మాదకద్రవ్యాల సమస్య పరిష్కారం కాదన్నది పాలకులు గుర్తించాలని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదేశ్ హితవు(mlc dwarapureddy jagadesh on drugs in state) పలికారు. రాష్ట్రంలో గంజాయి సాగుపై పోలీసులు విలేఖరుల సమావేశం పెట్టి మరీ చెప్తే, బీబీసీ సంస్థ ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారం చేసిందని పేర్కొన్నారు. విశాఖ మన్యం నుంచి విచ్చలవిడిగా సరఫరా అవుతున్న గంజాయిని కట్టడిచేయలేని పోలీసులు దానిపై మాట్లాడే ప్రతిపక్షాలకు నోటీసులివ్వటం సిగ్గుచేటని మండిపడ్డారు. మాదకద్రవ్యాల మాఫియాను ప్రభుత్వం అరికట్టకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
వైకాపా విధానాలతోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు: మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి
జగన్ రెడ్డి ప్రభుత్వం చేతకానితనంతోనే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం.. 2వ స్థానంలో, కౌలు రైతు ఆత్మహత్యల్లో 3వస్థానంలోనూ ఉందని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు(Telugu Raithu State President Mareddy Srinivas Reddy on farmers suicide)."జాతీయ నేరపరిశోధన సంస్థ లెక్కల ప్రకారం 2019లో 1029మంది, 2020లో 889మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు కారణం.. జగన్ రెడ్డి ప్రభుత్వం కుంటి సాకులతో సకాలంలో పంటను కొనుగోలు చేయకపోవడమే. మొక్కజొన్న, జొన్న రైతులకు ఆరునెలల నుంచి కొనుగోళ్ల తాలుకు బకాయిలు చెల్లించట్లేదు. ప్రభుత్వ మోసపూరిత విధానాలే రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి." అని మర్రెడ్డి దుయ్యబట్టారు.