ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ అసమర్థతతోనే మహిళలపై దాడులు: తెదేపా నేతలు - హోంమంత్రి సుచరితపై వర్ల రామయ్య కామెంట్స్

వైకాపా ప్రభుత్వ అసమర్థతతోనే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. గుంటూరు ఘటనలో నిందితుడిని వెంటనే శిక్షించి ఉంటే రాజుపాలెం లాంటి మరో ఘటన జరిగి ఉండేది కాదన్నారు. చంద్రబాబు హయాంలో ఆడబిడ్డలకు చెడు చేయాలంటేనే భయంతో వణికిపోయేవారని వర్ల పేర్కొన్నారు.

Increased attacks on women in AP
ఏపీలో మహిళలపై పెరిగిన దాడులు

By

Published : Aug 19, 2021, 5:59 PM IST

రాష్ట్రంలో ఏ అఘాయిత్యం, అరాచకం, అన్యాయం జరిగినా.. డబ్బుతో అణిచివేయాలని వైకాపా ప్రభుత్వం చూస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. పట్టపగలు నడిరోడ్డుపై యువతిని దారుణంగా హత్యచేస్తే నిందితున్ని శిక్షించాల్సిన ప్రభుత్వం.. బాధిత కుటుంబానికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం దారుణం అన్నారు. చంద్రబాబు హయాంలో ఆడబిడ్డలకు చేడు చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టేదని వర్ల రాయమ్య అన్నారు.

గుంటూరులో రమ్య హత్య కావడానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని వర్ల రామయ్య ఆరోపించారు. ఈ ఘటన మరవకముందే రాజుపాలెంలో బాలికపై ఇద్దరూ అత్యాచారం చేశారని దుయ్యబట్టారు. గుంటూరు ఘటనలో నిందితుడిని వెంటనే శిక్షించి ఉంటే రాజుపాలెం ఘటన జరిగి ఉండేది కాదన్నారు. దిశాచట్టం కింద రాష్ట్రంలో ముగ్గురికి ఉరిశిక్ష పడిందని.. 20 మందికి జీవితకాలం జైలుశిక్షఅనుభవిస్తున్నారని హోంమంత్రి సుచరిత, సజ్జల చెప్పడంలో వాస్తవం లేదన్నారు. ఆ మాటతో ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

అభివృద్ధి చూపిస్తే కట్టుబట్టలతో వెళ్లిపోతా: బొండా ఉమా

తెదేపా హయాంలో మంజూరు చేసిన సామాజిక భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ ధర్నా చౌక్​ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. నగరంలో రూ. 600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెబుతున్న ఎమ్మెల్యే విష్ణు.... దాన్ని నిరూపిస్తే కట్టుబట్టలతో ఊరు వదిలివెళ్లిపోతానని సవాల్‌ విసిరారు. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో భాగంగా నగరంలో ఎక్కడ నిర్మాణాలు చేపట్టారో చూసుకుని వసూళ్లకు తెరా తీశారని ఆరోపించారు.

నియోజకవర్గంలో ప్రజలను కనీస మర్యాద ఇవ్వకుండా..దూషిస్తున్నారని ఆరోపించారు. తన హయాంలో మొదలు పెట్టిన పనులకే మళ్లీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. వంగవీటి రంగా, దాసరి నారాయణరావు సామాజిక భవనాలను మీరు కట్టలేకపోతే మాకప్పగిస్తే సొంత నిధులతో కట్టిస్తామన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సామాజిక వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి వైకాపా ప్రభుత్వం మోసాలను ఎండగడతామన్నారు.

జగన్​ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం: రాజేంద్రప్రసాద్
ప్రభుత్వ జీవోలను రహస్యంగా ఉంచాలన్న ముఖ్యమంత్రి జగన్​ నిర్ణయం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ప్రభుత్వ సమాచారం ప్రజలకు తెలియాల్సిందే అన్నారు. జగన్​.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ జీవోలు.. ఆఫ్​​లైన్​లో ఉంచడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టాకైనా.. ఏపీ ముఖ్యమంత్రి బాధ్యతతో వ్యవహరించకపోవడంపై ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై న్యాయపరంగా ముందుకెళ్తమన్నారు.

నేరస్తుల్ని వైకాపా ప్రోత్సహిస్తోంది: సప్తగిరి ప్రసాద్

రమ్యశ్రీ హత్య కేసులో నిందితడిపై చర్యలు తీసుకోకుండా వైకాపా ప్రభుత్వం నేరస్తుల్ని ప్రోత్సహిస్తోందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. మహిళలపై 500 కుపైగా దాడులు జరిగితే దిశ చట్టం కింద ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేతగా బాధిత కుటుంబాలను తెలుగుదేశం పార్టీ నేత లోకేశ్ పరామర్శిస్తే.. వైకాపా నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. లోకేశ్ పర్యటనల్లో వైకాపా పేటీఎం బ్యాచ్ అల్లర్లు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. మంత్రి పదవులు కాపాడుకునేందుకు లోకేశ్​పై విమర్శలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు.

బాధిత కుటుటంబాన్ని ఆదుకోవాలి: కేశినేని శ్వేత

బాధితుల కుటుంబానికి నష్టపరిహారం అందజేసి అధికార పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని కేశినేని నాని కుమార్తె శ్వేత మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్​లో హత్యకు గురైన విజయవాడలోని చిట్టి నగర్​కు చెందిన మహిళ కుటుంబసభ్యులను శ్వేత పరామర్శించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ సందర్బంగా పశ్చిమ నియోజకవర్గ తెదేపా నాయకులు, మైనార్టీ నేతలు, పలువురు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

CBN: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్‌..నేతల మంతనాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details