ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా బూటకపు తీర్మానం ప్రవేశపెట్టారు' - ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ తీర్మాణం

ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం బూటకపు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ముస్లింలను మరోసారి మోసగిస్తున్నారని తెదేపా నేత హిదాయత్ ఆరోపించారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషతో తీర్మానాన్ని ప్రవేశపెట్టించి దీనిపై సీఎం ఒక్క మాట మాట్లాడకపోవటంతోనే మోసం వెనక ఉన్న కుట్ర కోణం బయటపడుతుందన్నారు.

'ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా బూటకపు తీర్మాణం ప్రవేశపెట్టారు'
'ఎన్​పీఆర్​కు వ్యతిరేకంగా బూటకపు తీర్మాణం ప్రవేశపెట్టారు'

By

Published : Jun 19, 2020, 3:12 PM IST

ఎన్​పీఆర్​పై బూటకపు తీర్మానంతో ముస్లింలను ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి మోసగించారని తెదేపా నేత ఎండీ. హిదాయత్ విమర్శించారు. కేరళ, తెలంగాణ తరహాలో ఎన్​పీఆర్​ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. 2010 ఎన్​పీఆర్​లోని అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోమని కేంద్రాన్ని కోరతామని మాత్రమే తీర్మానంలో ఉందన్నారు. సంపూర్ణంగా ఎన్​పీఆర్​ను రద్దు చేస్తామని కడపలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని హిదాయత్ గుర్తుచేశారు. 2019, ఆగస్టు 16న ఎన్​పీఆర్ అమలు చేయడానికి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి దానిని ఉపసంహరించుకోకుండా కేవలం బూటకపు తీర్మానాన్ని ప్రవేశపెట్టారని ఆరోపించారు.

ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషతో తీర్మానాన్ని ప్రవేశపెట్టించి దీనిపై ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడకపోవటంతోనే ముస్లింలకు చేస్తున్న మోసం వెనక ఉన్న కుట్ర కోణం బయటపడుతుందని తెలిపారు. తీర్మానం విషయంలో అసెంబ్లీలో చర్చ జరిగితే డొల్లతనం భయటపడుతుందన్న భయంతో కేవలం నిమిషాల వ్యవధిలో తీర్మానాన్ని ముగించారని హిదాయత్‌ ఆక్షేపించారు.

ఇదీ సంగతి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 465 కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details