కమీషన్ల కక్కుర్తి వల్లే.. టీకాల గ్లోబల్ టెండర్లకు ఎవరూ ముందుకు రాలేదని తెలుగుదేశం సీనియర్ నేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు. కరోనా వల్ల పరిస్థితులు ఇంత దిగజారడానికి ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలన్నారు. వైరస్ వల్ల వేల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్‌కు చికిత్స అందించట్లేదని... ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు.
కమీషన్ల కక్కుర్తి వల్లే గ్లోబల్ టెండర్లకు స్పందన లేదు: జీవీ
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలంకావడం పట్ల తెదేపా నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు. కమీషన్ల కక్కుర్తి వల్లే గ్లోబల్ టెండర్లకు స్పందన లేదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే వ్యాక్సినేషన్లో రాష్ట్రం వెనుకబడిందని చెప్పారు.
gv anjaneyulu