తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి.. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కొవిడ్‌తో చితికిపోయి ఉన్న చిరువ్యాపారుల వద్ద నెలనెల డబ్బులు వసూలు చేయడం ఆక్షేపణీయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామంటూ చిరు వర్తకుల వద్ద డబ్బు వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. పెట్రో ధరలు తెలంగాణ కంటే రాష్ట్రంలో ఎందుకు పెరిగాయో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలన్నారు.
'చిరు వ్యాపారుల వద్ద నెలవారి రుసుం వసూలు ఆక్షేపణీయం'
తోపుడు బండ్ల మీద ఆధారపడి జీవనం సాగించే చిరు వ్యాపారుల వద్ద ప్రభుత్వం నెలవారి రుసుములు వసూలు చేయడం ఆక్షేపణీయమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇప్పటికే కొవిడ్‌తో కుదేలైన వారి వద్ద డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు.
tdp leader gorantla buchayya chowdari