మొన్నటి దాకా ఎన్నికల సంఘాన్ని, కమిషనర్‌ను సమర్థించిన వైకాపాకు... రాత్రికి రాత్రే రమేశ్‌కుమార్ చెడ్డవారయ్యారా? అంటూ తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. పారాసిటమాల్ ద్వారా కరోనాను దూరం చేయొచ్చని సీఎం జగన్ చెప్పిన తర్వాత... చైనా, ఇటలీ ఆయనను వారి దేశాలకు ఆహ్వానిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషనర్‌ను తొలగించే అధికారం జగన్‌కు లేదని, అది రాష్ట్రపతి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేశారు.
రాత్రికి రాత్రే రమేశ్‌కుమార్ చెడ్డవారయ్యారా?: గోరంట్ల - తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి
రాత్రికి రాత్రే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెడ్డవారయ్యారా? అంటూ తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రశ్నించారు. పారాసిటమాల్ వాడాలని సీఎం అంటున్నారన్న గోరంట్ల... వైరస్ చికిత్స కోసం జగన్‌ను చైనా, ఇటలీ దేశాలు పిలుస్తున్నాయని ఎద్దేవా చేశారు.
gorantla