ప్రపంచంలో 24 గంటల్లో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో... భారత దేశం మూడవ స్థానంలో ఉందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉందన్న ఆయన... రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఒకటవ స్థానంలో ఉందని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. 'నివారణ కంటే నిరోధన ఉత్తమం' అని గోరంట్ల ట్వీట్ చేశారు.
'నివారణ కంటే నిరోధన ఉత్తమం' : గోరంట్ల - గోరంట్లు బుచ్చయ్య చౌదరి వార్తలు
దేశంలో కరోనా కేసుల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉందని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఒకటవ స్థానంలో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
గోరంట్లు బుచ్చయ్య చౌదరి