అద్దె ఆధారంగా పన్ను వసూళ్లకు బదులు ఆస్తి విలువ ఆధారంగా పన్నులు(PROPERTY TAX) విధించటం పట్టణ ప్రజలు మోయలేని భారమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలపై ఇలాంటి భారం మోపడం సరికాదన్నారు.
దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోందన్నారు. కొత్త ఆస్తి పన్ను విధానంపై ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని డిమాండ్ చేశారు. పన్ను అధికంగా పెంచుతున్నారని ప్రజలు అంటుంటే మంత్రి బొత్స గరిష్ఠ పెంపు 15 శాతామే అనడం హాస్యాస్పదమని ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు.