విద్యావ్యవస్థ పతనానికి దారితీసేలా ముఖ్యమంత్రి జగన్(cm jagan) మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని.. తెదేపా పొలిట్ బ్యూరోసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి(tdp leader gorantla buchaiah chowdary) ధ్వజమెత్తారు. కేవలం ఆస్తుల కోసమే ఎయిడెడ్ విద్యావ్యవస్థ(aided schools)ల స్వాధీనానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకు చెందిన లక్షలకోట్ల ఆస్తులను తాకట్టుపెట్టి, అప్పులు తేవాలన్న తాపత్రయంలో ప్రభుత్వముందని విమర్శించారు.
లక్షలాది విద్యార్థులు, వేలాదిమంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకునే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనంతో, తనకు ఓట్లేసిన క్రిస్టియన్, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలనే ముఖ్యమంత్రి రోడ్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన అన్ని జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.