సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవద్దని ఉన్నత న్యాయస్థానాలు చెబుతున్నా.. ప్రభుత్వాల సహకారం లేకపోవటం దౌర్భాగ్యమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. "అంబులెన్సుల గొడవలు పునరావృతమవటంతో.. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. దీనిపై చర్చించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు.
కోర్టులు చెబుతున్నా ప్రభుత్వాలకు పట్టదా.? : గోరంట్ల - తెలంగాణ ప్రభుత్వంపై గోరంట్ల ఆగ్రహం
సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవద్దని రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలు చెబుతున్నా.. ప్రభుత్వాలు సహకరించకపోవటం విడ్డూరమని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల సీఎంలు దీనిపై చర్చించాలన్నారు.
gorantla buchaiah chowdary