జగనన్న ఇళ్లు పథకం(JAGANANNA HOUSES) కింద రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి(CM JAGAN) నిర్మిస్తున్న గృహాలపై సొంతపార్టీ నేతలే విమర్శిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్ బాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో కట్టించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా రెండేళ్లుగా వాటిని నిరుపయోగంగా ఉంచడంపై మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే ఇళ్లపై తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని.. ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలకోసం ఐదేళ్ల కాలంలో 25 లక్షల ఇళ్లను నిర్మిస్తామని ప్రగల్భాలు పలకడంపై దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎక్కడ నిర్మించారు..?, ఎవరికి కట్టించారు..?, ఎన్ని కట్టించారు..? అని ఎరిక్షన్ బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. శాశ్వత ఆస్తులు రాష్ట్రానికే కాకుండా ప్రజలకు కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టని వ్యక్తి మూడు రాజధానులు(THREE CAPITALS) కడతారా అని ఎద్దేవా చేశారు.