ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మీటర్లు పెట్టడం ఎందుకు.. మళ్లీ రాయితీ ఇవ్వడం ఎందుకు..?' - tdp latest news

Dhulipalla on YSRCP: వైకాపా సర్కారుపై తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు గుప్పించారు. జగన్ సీఎం అయ్యాక వ్యవసాయానికి సాయం తగ్గిందని మండిపడ్డారు. కేంద్రానికి దాసోహమై సాగు బోర్లకు మీటర్లు బిగిస్తున్నారని ధ్వజమెత్తారు. మీటర్లు పెట్టడం ఎందుకు.. మళ్లీ రాయితీ ఇవ్వడం ఎందుకు అని నిలదీశారు. దేశంలో సగటు రుణభారం రూ.75 వేలు ఉంటే ఏపీ రైతులపై రూ.2.45 లక్షలు ఉందని ధూళిపాళ్ల ఆరోపించారు.

ధూళిపాళ్ల
ధూళిపాళ్ల

By

Published : May 16, 2022, 4:53 PM IST

Updated : May 16, 2022, 5:13 PM IST

Dhulipalla on Electricity Meters: జగన్ రెడ్డి సీఎం అయ్యాక వ్యవసాయానికి సాయం తగ్గిపోయిందని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు అంటూ ఇస్తే.. అది జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో రైతులపై సగటు రుణభారం రూ.75వేలు ఉంటే, ఏపీ రైతులపై ఉన్న రుణభారం రూ.2.45లక్షలు ఉండటానికి జగన్ రెడ్డి విధానాలే కారణమని దుయ్యబట్టారు.

'మీటర్లు పెట్టడం ఎందుకు.. మళ్లీ రాయితీ ఇవ్వడం ఎందుకు..?'

రాష్ట్రంలో రైతుభరోసా పేరుతో ఇతర పథకాలను ఆపేశారని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. రైతులను కులాల పేరుతో వైకాపా ప్రభుత్వం విభజిస్తోందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నరేంద్ర మాట్లాడారు. రైతులను బాదే కార్యక్రమం తప్ప.. వాళ్లను బాగుచేసే పని ఒక్కటీ ఈ ప్రభుత్వం చేయడం లేదని ఆయన విమర్శించారు.

వ్యవసాయ మీటర్లు పెట్టబోమని పక్కనే ఉన్న తెలంగాణ తేల్చిచెప్పగా.. వైకాపా ప్రభుత్వం మాత్రం కేంద్రానికి దాసోహమైందని ధూళిపాళ్ల నరేంద్ర ఆక్షేపించారు. మీ స్వార్థం కోసం రైతులను ఎందుకు బలి చేస్తారని వైకాపా నేతలను ఆయన ప్రశ్నించారు. రైతుల మెడపై కత్తిపెట్టి మీటర్లు పెట్టడం ఎందుకు? రాయితీ ఇవ్వడం ఎందుకు? అని నరేంద్ర నిలదీశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఎత్తేసేందుకు కుట్రలా ఇది కనబడుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆక్వారంగంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులకు.. ఏం చేయాలో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్బీకేల పేరుతో రైతుల్ని నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:Nara Lokesh : సీఎం జగన్​కు.. నారా లోకేశ్ 17 ప్రశ్నలు.. ఏంటంటే..!

Last Updated : May 16, 2022, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details