ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dhulipalli letter to cm Jagan: వైకాపా.. రైతు దగా ప్రభుత్వం: ధూళిపాళ్ల నరేంద్ర - వైకాపా రైతు దగా ప్రభుత్వం

అన్నదాతల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి..తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర బహిరంగ లేఖ(dhulipalli narendra letter to cm jagan) రాశారు. వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, అసమర్థ విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలోకి వెళ్లిందని పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాలలో రైతులను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.

dhulipalla narendra letter to cm jagan
ధూళిపాళ్ల నరేంద్ర బహిరంగ లేఖ

By

Published : Oct 1, 2021, 4:16 PM IST

'వైకాపా రైతు ప్రభుత్వం కాదు.. రైతు దగా ప్రభుత్వం' అని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. వ్యవసాయానికి సాయంపై చెప్పే లెక్కలకు, వాస్తవాలకు పొంతనలేదని మండిపడ్డారు. అన్నదాతల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ధూళిపాళ్ల నరేంద్ర బహిరంగ లేఖ(tdp leader dhulipalli narendra letter to cm jagan) రాశారు. వైకాపా విధానాల వల్ల కోస్తాలో క్రాప్ హాలిడే(crop holiday) రైతులు ప్రకటించారని దుయ్యబట్టారు. రాయలసీమలో ఉల్లి, టమాటతోపాటు ఉద్యాన పంటలకు ధరలు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక అనంతపురం జిల్లాలోనే 10 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని ఆక్షేపించారు. రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఇవి చాలవన్నట్లు మోటార్లకు మీటర్లు పెడుతూ.. వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంటలకు ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుల్లో మోసం చేశారని ఆరోపించారు. పంటకు ఇన్సూరెన్స్ విషయంలో దగా చేశారన్నారు. రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తామని చెప్పి.. రూ.7,500 మాత్రమే ఇస్తున్నారని ధూళపాళ్లి నరేంద్ర(dhulipalli narendra) ధ్వజమెత్తారు. ఒక్కో రైతుకు సంవత్సరానికి రూ. 6 వేల చొప్పున ఐదేళ్లలో రూ. 30 వేలు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 64 లక్షల మందికి రైతు భరోసా ఇస్తానని చెప్పి.. 45 లక్షలకే కుదించారని మండిపడ్డారు. 15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి 49 వేల మందికి తగ్గించారని దుయ్యబట్టారు. రైతులను కులాల వారీగా విభజించిన చరిత్ర.. జగన్ రెడ్డిదేనని నరేంద్ర ఎద్దేవా(dhulipalli narendra fire on cm jagan) చేశారు.

ధాన్యం బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం కావడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆక్షేపించారు. రెండున్నర సంవత్సరాలలో సబ్సీడీపై ఒక్క వరినాటు యంత్రం గాని.. వరికోత మిషన్​ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. గత తెదేపా హయాంలో 90 శాతం సబ్సీడీతో మెట్ట ప్రాంత రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అందించగా.. ఒక్క శాతం సబ్సిడీ కూడా ఇవ్వని వైకాపా రైతు దగా ప్రభుత్వమని విమర్శించారు. రైతుల్ని దొంగల్లా చూస్తూ.. మోటార్లకు మీటర్లు బిగిస్తూ అన్నదాతలకు ఉరితాడు బిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్​ను తొలిగించే ప్రభుత్వం.. రైతు ప్రభుత్వమా? రైతు దగా ప్రభుత్వమా అని ప్రశ్నించారు.

అన్ని వాణిజ్య పంటలు, వ్యవసాయ పంటలకు గిట్టుబాటు(minimum price) ధర అందించడం లేదని ధ్వజమెత్తారు. సహకార సంఘ పాల డైయిరీల(dairy farms)ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని దుయ్యబట్టారు. పోలవరాన్ని గాలికి వదిలేసిన వైకాపా ప్రభుత్వం.. సాగు నీటికి బడ్జెట్​లో కోత విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో బచావత్ కమిషన్.. ఏపీకి కల్పించిన హక్కుల్ని కేంద్రానికి ధారాదత్తం చేయడం, పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల్ని అరికట్టలేకపోవడం రైతు దగా కాదా అని(dhulipalli narendra letter to cm jagan) నిలదీశారు.

ఇదీ చదవండి..

CM Jagan Kadapa Tour: రేపు సొంత జిల్లాకు సీఎం జగన్.. రెండు రోజుల పాటు పర్యటన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details