ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dhulipalla: పశువుల మేతలో వైకాపా నేతల కుంభకోణం: ధూళిపాళ్ల నరేంద్ర - వైకాపా పశువుల దాణా కుంభకోణంపై తెదేపా నేత నరేంద్ర కామెంట్స్​

రాష్ట్రంలో పశువుల దాణా తరహా కుంభకోణానికి వైకాపా నాయకులు తెర లేపారని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. మూగజీవాల పేరుతో ప్రభుత్వం భారీ దోపిడికి పాల్పడుతోందన్నారు. ప్రభుత్వం.. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతోందని నరేంద్ర మండిపడ్డారు.

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర
Dhulipalla

By

Published : May 31, 2022, 4:18 PM IST

Updated : May 31, 2022, 7:04 PM IST

Dhulipalla Narendra: రాష్ట్రంలో పశువుల దాణా తరహా కుంభకోణానికి వైకాపా నాయకులు తెర లేపారని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర ఆరోపించారు. వైకాపా నేతలు సుమారు రూ. 40 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని నరేంద్ర పేర్కొన్నారు. 'ఆర్బీకేల ద్వారా వల్లభ ఫీడ్​ను అమ్ముతున్నారు. వల్లభ ఫీడ్స్ దాణా వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుది. పశువుల దాణా కుంభకోణం అంటారో ఏమో కానీ.. మూగజీవాల పేరుతో ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోంది. ప్రభుత్వం కమిషన్ల కోసం కక్కుర్తి పడుతోంది. ఫెర్టయిల్ గ్రీన్ అనే కంపెనీ ద్వారా పశువుల మేత కోసం వినియోగించే టీఎంఆర్​ను మెట్రిక్ టన్ను రూ.16 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మేతనే కొనుగోలు చేయాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. వెటర్నరీ డాక్టర్లకు టార్గెట్ పెట్టి మరీ ఫెర్టయిల్ గ్రీన్ కంపెనీ సరఫరా చేసే మేతను కొనుగోలు చేయిస్తున్నారు. మార్కెట్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ.. రూ. 16 వేలకు కొనుగోలు చేస్తున్నారని' నరేంద్ర మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూడని నరకాన్ని గత మూడేళ్లల్లో జగన్ ప్రభుత్వం చూపుతోందని నరేంద్ర విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక.. ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయి కానీ.. రైతుల పంటకు ధర మాత్రం పెరగలేదని ఆక్షేపించారు. ఈ ప్రభుత్వం పంటల బీమాను గాలికొదిలేసిందని మండిపడ్డారు. తెదేపా చేసిన రైతు రుణమాఫీని తాము ఎందుకు కట్టాలన్న జగన్ ప్రభుత్వం.. గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు ఓటీఎస్ ఎలా అమలు చేస్తారని నిలదీశారు. పన్నుల బాదుడు కోసం గత ప్రభుత్వ విధానాలు అమలు చేస్తారా ? అని ప్రశ్నించారు.

గులాబ్, జవాద్ వంటి విపత్తుల్లో 9.52 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. ఒక్క పైసా విడుదల చేయలేదని విమర్శించారు. పశువులు చనిపోతే డబ్బులిస్తామన్న ప్రభుత్వం.. సుమారు రూ. 100 కోట్లు పెండింగులో పెట్టిందన్నారు. గోపాల మిత్ర వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలయ్యేలా పథకాల్లో 60 శాతం కేంద్ర నిధులతో చేపడుతున్నారని దుయ్యబట్టారు.

పశువుల మేతలో వైకాపా నేతల కుంభకోణం: నరేంద్ర

ఇదీ చదవండి:

Last Updated : May 31, 2022, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details