ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DEVINENI UMA: 'అన్నదాతలకు డబ్బు చెల్లించకుండా ఆటలు'

రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం వారికి సొమ్ము చెల్లించకుండా(PADDY DUES) జాప్యం చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(DEVINENI UMA) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చర్యల వల్లే రైతులు మళ్లీ పొలంలో అడుగు పెట్టలేని స్థితిలో ఉన్నారని ఆరోపించారు.

DEVINENI UMA
రైతులకు డబ్బు చెల్లించకుండా ప్రభుత్వం ఆటలు

By

Published : Jul 17, 2021, 8:51 PM IST

ధాన్యం అమ్ముకున్న రైతు మళ్లీ పొలంలోకి వెళ్లి వ్యవసాయం చేసే పరిస్థితి లేదని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(DEVINENI UMA) ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జి.కొండూరులో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేప్టటారు. రైతులు పండించిన పంటను అమ్ముకుంటే వైకాపా ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లించకుండా(PADDY DUES).. ఆ డబ్బులతో ఆటలాడుతోందని మండిపడ్డారు.

చంద్రబాబు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. గతంలో రైతులకు విత్తనాలు, పెట్టుబడి రుణాలు, పట్టాలు ఇచ్చేవారమని అన్నారు. రూ.41 వేల కోట్లు ఏమయ్యాయో.. దానిపై ముఖ్యమంత్రి జగన్​ (CM JAGAN) ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. సీఎం తాడేపల్లి రాజాప్రసాదంలో పబ్జీ(PUBG) ఆడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. సీబీఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో నుంచి కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని దేవినేని ఉమ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details