Devineni Uma on Land Mafia: మట్టి మాఫియాలో వైకాపా గూండాలు రాష్ట్రవ్యాప్తంగా బరితెగించారని తెదేపా నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంత్రి పదవి పోతే విశ్వరూపం చూపిస్తా అన్న కొడాలి నాని విశ్వరూపం మట్టి మాఫియాలో బయటపడిందని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ నిద్రపోతున్నారని దేవినేని ధ్వజమెత్తారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. కొండలను కొల్లగొట్టి మట్టి మాఫియా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటాల కోసం వైకాపా నేతలు తన్నుకుచావడం సిగ్గుచేటని విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేల అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి మట్టి తవ్వకాలే రుజువులు అని దేవినేని ఉమా అన్నారు.
మట్టి మాఫియాలో బరితెగించిన వైకాపా నేతలు : దేవినేని ఉమా - ysrcp farmer minister kodali nani
Devineni Uma Comments On Kodali Nani: రాష్ట్రంలో జరుగుతున్న మట్టి తవ్వకాలపై తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. మట్టి మాఫియాలో వైకాపా గూండాలు రాష్ట్రవ్యాప్తంగా బరితెగించారని ఆరోపించారు. మాజీ మంత్రి కొడాలి నాని విశ్వరూపం మట్టి మాఫియాలో బయటపడిందని మండిపడ్డారు.
Devineni Uma On Kodali Nani