ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం నిర్మాణంలో ఇబ్బందులకు కారణమదే - దేవినేని ఉమ న్యూస్

Devineni On Polavaram.. పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని వరద ముంచెత్తడానికి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు. కేంద్ర జలవనరుల శాఖ, జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ మార్గదర్శకాలనూ పాటించలేదని కేంద్ర సంస్థలు హెచ్చరిస్తున్నా.. సీఎం జగన్ మాత్రం అన్నింటిని పెడచెవిన పెట్టారని మండిపడ్డారు.

పోలవరం నిర్మాణంలో ఇబ్బందులకు కారమణమదే
పోలవరం నిర్మాణంలో ఇబ్బందులకు కారమణమదే

By

Published : Aug 10, 2022, 8:51 PM IST

Devineni Uma On Polavaram కాంట్రాక్ట్ సంస్థ, జలవనరుల శాఖ సరైన ప్రణాళిక అమలు చేయకపోవటం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం కావటానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ ఏడాది జులై 15న ఏపీ సీఎస్​కు లేఖ రాసిందని గుర్తు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ, జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ మార్గదర్శకాలనూ పాటించలేదని కేంద్ర సంస్థలు హెచ్చరిస్తున్నా.. సీఎం జగన్ మాత్రం అన్నింటిని పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక యాజమాన్య విభాగం ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా పీపీఏ చెబుతున్నా.. జగన్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గోదావరి వరదల్లో దిగువ కాఫర్‌ డ్యాం మీదుగా వరద నీరు పోటెత్తి ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తడానికి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details