TDP leader Devineni Uma ప్రధానికి ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రాన్ని మీడియాకు ఇవ్వలేని దౌర్భాగ్య, సిస్సహాయ స్థితిలో సీఎం ఉండటం సిగ్గుచేటని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. 22 మంది ఎంపీలు, 9మంది రాజ్యసభ సభ్యులు ఉండి కూడా విభజన హామీలు సాధించలేకున్నారని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలంటే అనుమతి కావాలనడం సిగ్గుచేటని దేవినేని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో లక్షలాది మంది పోలవరం డ్యామ్‌ను సందర్శించారని గుర్తుచేశారు. తెదేపా హయాంలో చేసిన డయాఫ్రమ్ వాల్ పనులకు రీయంబర్స్ ఇస్తే... దాన్ని లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులుగా ఇచ్చుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ అసమర్థతతో లోయర్ కాఫర్ డ్యామ్‌లో నుంచి ఇసుక రవాణాకు పాల్పడి నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాపై బురదజల్లడం, అవినీతి ఆరోపణలు చేయడం, నాయకులను జైళ్లల్లో పెట్టడం తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన వైకాపాకులేదని దేవినేని ఉమమహేశ్వరరావు మండిపడ్డారు.
Devineni Uma కేంద్రం సొమ్ములను ప్రభుత్వం లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులుగా ఇచ్చింది - ఏపీ తాజా వార్తలు
TDP leader Devineni Uma పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన సొమ్ములను లిక్కర్ కంపెనీలకు జగన్ ప్రభుత్వం అడ్వాన్సులుగా ఇచ్చిందని తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవినేని ఉమ