సంపద సృష్టి చేతగాని వైకాపా ప్రభుత్వం.. లాక్ డౌన్ సమయంలో స్లాబుల రేట్లు రెట్టింపు చేసి కరెంట్ ఛార్జీల బాదుడు మొదలుపెట్టిందని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఛార్జీల మోత మోగిస్తున్నారన్నారు.
'సంపద సృష్టించడం చేతకాక.. ప్రజలపై కరెంట్ ఛార్జీల బాదుడు' - వైకాపా ప్రభుత్వంపై దేవినేని ఉమ ఆగ్రహం
ఎన్నికల సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కరోనా లాంటి కష్ట సమయంలో వైకాపా ప్రభుత్వం ప్రజలపై కరెంట్ ఛార్జీల బాదుడు మొదలుపెట్టిందని తెదేపా నేత దేవినేని ఉమ విమర్శించారు.
వైకాపా ప్రభుత్వంపై దేవినేని ఉమ విమర్శలు
ఈ అన్యాయపు వసూళ్లని ఆపాలని డిమాండ్ చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పితీరాలన్నారు.
ఇవీ చదవండి.. నెల్లూరులోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం