ఆల్మట్టి ప్రాజెక్టుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలను సీఎం జగన్ ఎందుకు ఖండించడం లేదని తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచబోతున్నామని కర్ణాటక సీఎం అంటున్నారని... ఈ అంశంపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
DEVINENI UMA : 'కృష్ణా జలాలపై జగన్, మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు' - devineni uma fire on CM jagan
ముఖ్యమంత్రి జగన్ వైఖరిపై తెదేపా నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతామన్న కర్ణాటక సీఎం వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
![DEVINENI UMA : 'కృష్ణా జలాలపై జగన్, మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు' దేవినేని ఉమ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12908455-33-12908455-1630217618598.jpg)
దేవినేని ఉమ
Last Updated : Aug 29, 2021, 2:30 PM IST