రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న ఆంగ్లమాధ్యమ విధానంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. తమ పార్టీ పేరులో తెలుగు ఉన్నందుకే ముఖ్యమంత్రి జగన్ ఇలా చేస్తున్నారేమేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన ఇసుక సత్యాగ్రహ దీక్ష సన్నాహక సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడారు. మాతృభాషా ఆవశ్యకత గురించి చెప్పిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పథకాల అమలుకోసం ప్రభుత్వ ఆస్తులను అమ్ముతామంటే చూస్తూ ఊరుకోమని దేవినేని హెచ్చరించారు. నవంబర్ 14 విజయవాడలో చంద్రబాబు తలపెట్టిన ఇసుక సత్యాగ్రహ దీక్షలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
'తెదేపాలో తెలుగు ఉందని ఇలా చేస్తున్నారేమో' - ఇసుక విధానంపై చంద్రబాబు నిరసన దీక్ష న్యూస్
తెలుగుదేశం పార్టీ పేరులో తెలుగు కనిపిస్తోందని సీఎం జగన్ రాష్ట్రంలో తెలుగు లేకుండా చేయాలని చూస్తున్నారేమోనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
tdp leader devineni uma comments on ycp govt