వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించిందని.. మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి అడ్రస్ లేరని.. సీఎం జగన్ నోరు విప్పడం లేదని దుయ్యబట్టారు.
"పట్టిసీమ దండగ, పంపులు పీకుతాం" అన్న వాళ్లకు పోలవరం ఎత్తిపోతల కట్టాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. కమీషన్ల కోసమే పోలవరం లోపల మరో ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారని ఉమ ఆరోపించారు. పోలవరంలో అక్రమాలు జరిగాయని గతంలో ఆరోపించారని.. అక్రమాలు జరిగితే రెండున్నరేళ్లుగా మీరేం చేశారని సీఎం జగన్ను ప్రశ్నించారు. ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేసి సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.