ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Devineni chandu: తెదేపా అండతోనే దేవినేని కుటుంబం ఎదిగింది: చందు - విజయవాడ తాజా వార్తలు

దేవినేని కుటుంబం ఎదిగింది తెలుగుదేశం పార్టీ అండతోనేనని.. కుటుంబం పరువు తీసేలా అవినాష్ వ్యవహరించారని తెలుగు యువత నేత దేవినేని చందు ఆరోపించారు. నెహ్రు చనిపోయేవరకు తెదేపాలోనే ఉన్నారన్న ఆయన.. ఆ తర్వాత అవినాష్​కి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు.

దేవినేని చందు
దేవినేని చందు

By

Published : Oct 20, 2021, 7:10 PM IST

దేవినేని కుటుంబం ఎదిగింది తెలుగుదేశం పార్టీ అండతోనేనని.. కుటుంబం పరువు తీసేలా అవినాష్ వ్యవహరించారని తెలుగు యువత నేత దేవినేని చందు ఆరోపించారు. నెహ్రు చనిపోయేవరకు తెదేపాలోనే ఉన్నారన్న ఆయన.. నెహ్రు చనిపోయాక అవినాష్ కి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. అవినాష్​కి తెలుగు యువత పదవి ఇస్తుంటే సోదరుడి కోసం తాను త్యాగం చేశానన్నారు. అవినాష్ కంటే ముందు నుంచే పార్టీలో ఉన్నా, అవినాష్​కి పార్టీ పదవులిస్తుంటే పూర్తిగా సహకరించానని తెలిపారు. అమ్మలాంటి పార్టీ కార్యాలయాన్ని అవినాష్ భ్రష్టు పట్టించారని ఆక్షేపించారు. నిన్నటి దాడిలో అవినాష్ మిత్రబృందం, ఆయన అనుచరుడు కార్పొరేటర్ ఆరవ సత్యం పాల్గొన్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details