కరోనా రోగుల బాగోగులు పట్టించుకోకుండా మంత్రి కన్నబాబు.. తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప మండిపడ్డారు. చంద్రబాబు వ్యాక్సిన్ వేయించుకున్నారా? లేదా? అని కన్నబాబు ఆరా తీయటం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లాలో.. పడకలు దొరక్క, ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు ఇబ్బంది పడుతుంటే, కనీసం ఆసుపత్రిని కూడా సందర్శించలేదన్నారు. పంటకు గిట్టుబాటు ధర దొరక్క, ధాన్యం కొనేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మంత్రికి అవేమీ పట్టడం లేదని దుయ్యబట్టారు.
కొవిడ్ రోగుల బాగోగులు పట్టించుకోకుండా చంద్రబాబుపై విమర్శలా: చినరాజప్ప - మంత్రి కన్నబాబుపై నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం
కొవిడ్ బాధితుల ఇబ్బందులు పట్టించుకోకుండా మంత్రి కన్నబాబు.. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని తెదేపా నేత చినరాజప్ప విమర్శించారు. చంద్రబాబు వ్యాక్సిన్ వేయించుకున్నరా లేదా అని కన్నబాబు ఆరా తీయటం విడ్డూరంగా ఉందన్నారు.
కొవిడ్ రోగుల బాగోగులు పట్టించుకోకుండా చంద్రబాబుపై విమర్శలా: చినరాజప్ప
TAGGED:
minister kannababu updates