ఫైబర్‌నెట్‌పై బురదజల్లాలనే ప్రభుత్వ కుట్రలో భాగంగానే.. గౌరీశంకర్‌ను ఎండీగా నియమిస్తూ సీఎం స్వయంగా సంతకం చేశారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. అర్హత లేని వ్యక్తిని నియమించారంటూ ఆరోపణలు రావడంతో... దిక్కుతోచక తొలగించారన్నారు. ఆ తర్వాత గౌరీశంకర్ నకిలీ ధ్రువపత్రాలపై ఎందుకు విచారణ చేయలేదని, ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
గౌరీశంకర్ నకీలీ సర్టిఫికెట్లపై ప్రభుత్వం విచారణ జరపాలని రాజప్ప డిమాండ్ చేశారు. అద్భుతమైన ప్రాజెక్టును కుట్రపన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్రలో భాగస్వాములందరినీ శిక్షించాలని రాజప్ప డిమాండు చేశారు.