ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వం తగిన విధంగా స్పందించటం లేదు: చినరాజప్ప - former home minister chinarajappa

రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రంగా ప్రబలుతున్న జగన్ ప్రభుత్వం తగిన విధంగా స్పందించడం లేదని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

tdp-leader-chinarajappa-comments-on-govt
తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప

By

Published : Apr 23, 2020, 6:34 PM IST

కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని...తెలుగుదేశం నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను వైకాపా నేతలు పాటించడం లేదన్న చినరాజప్ప...వైరస్‌ వ్యాప్తికి వారు కూడా కారణమవుతున్నారని తెలిపారు. 16వేల కేసుల నివేదికలు ఇంకా విడుదల చేయాల్సి వుందన్న అయన త్వరగా ఫలితాలు వచ్చేలా చూడాలని కోరారు. కరోనా పరీక్షలు విస్తృతంగా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా...చేసిన టెస్ట్​ల ఫలితాలు వెంటనే ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. కరోనా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పీపీఈ కిట్లు అందించాలని చినరాజప్ప డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details