ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chandra babu : 'ప్రైవేటు టీచర్లు ఉపాధి హామీ పనులకు వెళ్లడం దయనీయం' - private teachers in andhrapradhesh

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు(chandra babu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లను(private teachers) ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తక్షణ సహాయం కింద ప్రైవేట్ ఉపాధ్యాయులకు రూ.10వేలు, కరోనా తగ్గేంతవరకు ప్రతి నెలా రూ.7,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

TDP leader chandrababu naidu
తెలుగుదేశం అధినేత చంద్రబాబు

By

Published : Jul 2, 2021, 7:34 PM IST

ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని డిమాండ్ చేసినా... ప్రభుత్వంలో చలనం లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పలుగు, పార పట్టుకుని కూలీ పనులకు వెళ్తుండటం దయనీయమని పేర్కొన్నారు. తెలుగుదేశం చేపట్టిన సాధన దీక్షలో ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలని కోరామని చంద్రబాబు వెల్లడించారు. ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి తక్షణ సాయం కింద రూ.10 వేలు, కరోనా తీవ్రత కొనసాగినంత కాలం నెలకు రూ.7,500లు చొప్పున ఇవ్వాలని సూచించారు. కృష్ణా జిల్లా నున్నలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న ప్రైవేటు టీచర్ ప్రసాద్ దుస్థితిపై ఈనాడులో ప్రచురితమైన వార్తను చంద్రబాబు తన ట్విట్టర్ కు జత చేశారు.

ABOUT THE AUTHOR

...view details