వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(YS rajashekhar reddy) సహా ఏపీని పాలించిన ముఖ్యమంత్రులెవరూ..సీఎం జగన్(CM jagan) తరహాలో రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసాలకు పునాది వేసి నేటికి రెండేళ్లయిందని మండిపడ్డారు. కూల్చివేతలే తప్ప ఏ ఒక్కటీ కట్టకుండా తన పాలనా స్వభావాన్ని ప్రజలకు తెలియజెప్పాడన్నారు.
Chandrababu : 'సీఎం జగన్ రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించారు' - destroyed prajavedhika
ముఖ్యమంత్రి జగన్పై తెదేపా అధినేత చంద్రబాబు(chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(YS rajashekhar reddy) సహా... ఏపీని పాలించిన ముఖ్యమంత్రులెవరూ సీఎం జగన్(CM jagan) తరహాలో రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించలేదన్నారు. రెండేళ్లలోనే ఇలా ఉంటే... రాబోయే మూడేళ్లు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.
Chandrababu : 'సీఎం జగన్ రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించారు'
ఈ రెండేళ్ళలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తిరోగమన బాట పట్టాయని విమర్శించారు. రెండేళ్ళలోనే ఇలా ఉంటే.. రాబోయే మూడేళ్ళలో రాష్ట్రం ఎలా ఉంటుందో అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.