ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Petrol Prices: సీఎం జగన్.. ఆ మాట నిలబెట్టుకోలేదు : బుద్దా వెంకన్న - చమురు ధరలపై బుద్ధా వెంకన్న కామెంట్స్

అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తానన్న సీఎం జగన్.. తన మాట నిలబెట్టుకోలేదని తెదేపా నేత బుద్దా వెంకన్న విమర్శించారు. విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లడటం సరికాదని హితవు పలికారు. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అప్పుడో మాట ఇప్పుడో మాట సరికాదు
అప్పుడో మాట ఇప్పుడో మాట సరికాదు

By

Published : Nov 7, 2021, 2:23 PM IST

Updated : Nov 7, 2021, 6:14 PM IST

పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని తెదేపా నేత బుద్దా వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం జగన్..విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉంటే మరో మాట మాట్లడటం సరికాదని హితవు పలికారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తానన్న జగన్.. తన మాట నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు.

అధికారంలోకి వచ్చాక జగన్ కరోనాను బూచిగా చూపి పన్నులు పెంచుతూ రాష్ట్రాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్​పై వ్యాట్ తగ్గించాలన్న బుద్దా.. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో ధరలు రూపాయి తక్కువ ఉండాలని డిమాండ్ చేశారు.

అన్ని అబద్ధపు ప్రకటనలే..

లక్షలాది రూపాయలు వెచ్చించి ఇచ్చే ప్రభుత్వ పత్రికా ప్రకటనల్లో అన్ని అబద్ధాలే ఉంటున్నాయని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అన్నారు. ప్రతీది గత ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అన్న జగన్..అధికారంలోకి వచ్చాక అదే పని చేస్తున్నారుగా అని దుయ్యబట్టారు. ప్రజలపై భారం పడకూడదని 2018లో చంద్రబాబు పెట్రోల్, డీజిల్​పై రెండు రూపాయలు తగ్గించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్..ధరలు పెంచుతూ 3 జీవోలిచ్చారన్నారు. చంద్రబాబు హయాంలో రోడ్డు సెస్సు వసూలు చేయలేదని..,ప్రస్తుతం రోడ్లు బాగు చేయించకపోగా రోడ్డు సెస్సు వసూలు చేస్తున్నారని జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజల్ ధరలు పెంచి ప్రజలపై మోపిన భారం చాలక మళ్ళీ పెట్రోల్, డీజిల్ రేట్లపై పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం ప్రజల్ని మోసం చేయటమేనని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి

amaravati padayatra : పోటెత్తుతున్న అమరావతి ఉద్యమం.. పోలీసు హెచ్చరికలతో అలజడి!

Last Updated : Nov 7, 2021, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details