ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంద్రకీలాద్రిని వైకాపా కార్యాలయంలా మార్చారు: బుచ్చిరామ్​ప్రసాద్ - విజయవాడ ముఖ్యంశాలు

ఇంద్రకీలాద్రి(INDRAKELADRI NEWS)ని వైకాపా కార్యాలయంలా మార్చేశారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిరామ్​ప్రసాద్ దుయ్యబట్టారు. మంత్రి వెల్లంపల్లి సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనాన్ని దూరం చేస్తూ.. జగన్ పూజలో మునిగి తేలారని విమర్శించారు.

ఇంద్రకీలాద్రిని వైకాపా కార్యాలయంలా మార్చారు: బుచ్చిరామ్​ప్రసాద్
ఇంద్రకీలాద్రిని వైకాపా కార్యాలయంలా మార్చారు: బుచ్చిరామ్​ప్రసాద్

By

Published : Oct 16, 2021, 4:53 PM IST

Updated : Oct 16, 2021, 4:59 PM IST

దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారి ఇంద్రకీలాద్రి(INDRAKELADRI NEWS)ని వైకాపా కార్యాలయంలా మార్చేశారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(TDP SECRETARY) బుచ్చిరామ్ ప్రసాద్ దుయ్యబట్టారు. సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనాన్ని దూరం చేస్తూ మంత్రి వెల్లంపల్లి.. జగన్ పూజలో మునిగి తేలారని విమర్శించారు. హిందూ మత వ్యతిరేక కార్యక్రమాలకు నైతిక బాధ్యత వహించి తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించలేదన్నారు. సీఎం డౌన్ డౌన్ నినాదాలతో దుర్గమ్మ సన్నిధి మార్మోగటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. గుడి చుట్టూ వైకాపా రంగులతో లైటింగ్, ప్లెక్సీలు ఏర్పాటు చేయటంతో పాటు అన్యమత, పార్టీ ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆక్రమణలకు గురవుతున్న బ్రాహ్మణుల ఆస్తులను కాపాడేందుకు శక్తివంచన లేకుండా స్వామీజీలు, పీఠాధిపతులతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కాంగ్రెస్​ పార్టీకి నేనే ఫుల్​టైమ్​ అధ్యక్షురాలిని: సోనియా

Last Updated : Oct 16, 2021, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details