రిజిస్ట్రేషన్ శాఖ చలనాల కుంభకోణంలో వైకాపా పెద్దల హస్తం వుందని తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు. ఓ మంత్రి నుంచి అనేకమంది వైకాపా పెద్దలకు.. కోట్ల రూపాయల వాటాలు వెళ్ళాయని విమర్శించారు. చలానాల కుంభకోణంలో మంత్రి రాజీనామా చేసి దర్యాప్తు చేయిస్తే.. నిజాలు బయటకు వస్తాయని బోండా అభిప్రాయపడ్డారు.
BONDA UMA: చలానాల కుంభకోణంలో వైకాపా పెద్దల హస్తం: బోండా ఉమా - tdp leader bonda uma latest news
రిజిస్ట్రేషన్ శాఖ చలానాల కుంభకోణంలో వైకాపా పెద్దల హస్తం వుందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు. మంత్రి నుంచి అనేకమంది వైకాపా పెద్దలకు.. కోట్ల రూపాయల వాటాలు వెళ్ళాయని విమర్శించారు.
బోండా ఉమా
వైకాపా ప్రభుత్వం అధికారులపై విచారణ చేసి చేతులు దులుపుకోవాలనుకోవటం కుట్రలో భాగమేనని మండిపడ్డారు. గతంలో జరిగిన నకిలీ స్టాంపుల స్కామ్‌ను మించి ఏపీలో వైకాపా నాయకులు దోచేశారని దుయ్యబట్టారు. చిత్తశుద్ధి ఉంటే మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ చేస్తే నిజాలు నిగ్గు తెలుతాయని స్పష్టం చేశారు.