రాష్ట్రంలో విదేశీ విద్యకు ప్రభుత్వం సాయం లేదన్న తెదేపా నేత బొండా ఉమా.. ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పదో తరగతి ఫలితాలు ఇంత దారుణంగా రావడానికి ప్రభుత్వ నిర్వాకమే కారణమని విమర్శించారు. రెండు లక్షలమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్‌తో వైకాపా ప్రభుత్వం ఆడుకుంటోంది: బొండా ఉమా - వైకాపా నేత బోండా ఉమామహేశ్వరరావు
విద్యార్థుల భవిష్యత్‌తో వైకాపా ప్రభుత్వం ఆడుకుంటోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో విదేశీ విద్యకు ప్రభుత్వం సాయం లేదన్న ఆయన.. ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.
విద్యార్థుల భవిష్యత్‌తో వైకాపా ప్రభుత్వం ఆడుకుంటోంది: బోండా ఉమా
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేసి అమ్ముకుంది వైకాపా నేతలైతే.. మాజీ మంత్రి నారాయణపై నెపం నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడానికి జగన్ సర్కార్ నిర్ణయాలే కారణమని విమర్శించారు. జగన్ అసమర్ధ నిర్ణయాల వల్ల నేడు విద్యా వ్యవస్థ గాడి తప్పిందని ధ్వజమెత్తారు.
ఇవీ చూడండి: