ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

అన్నదాతలను వైకాపా ప్రభుత్వం నిండా ముంచేసిందని తెదేపా నేత బొండా ఉమ విమర్శించారు. రైతుల కోసం సీఎం జగన్ చేపట్టిన చర్యలేంటో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

tdp leader bonda uma fires on ycp government
వైకాపా ప్రభుత్వంపై బొండా ఉమ విమర్శలు

By

Published : Apr 28, 2020, 3:26 PM IST

Updated : Apr 28, 2020, 4:09 PM IST

వైకాపా ప్రభుత్వంపై బొండా ఉమ విమర్శలు

ముఖ్యమంత్రి జగన్ తీరు వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువయ్యాయని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా విమర్శించారు. టెస్టింగ్ కిట్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆయన.. పక్క రాష్ట్రంలో 300 రూపాయలు ఉన్న కిట్లను 700 రూపాయలకి కొనుగోలు చేసి అడ్డగోలుగా దోచేశారని ధ్వజమెత్తారు. మెడికల్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు లేవని ఆగ్రహించారు.

రైతుల కోసం సీఎం జగన్ చేపట్టిన చర్యలేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. లాక్‍డౌన్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. రాష్ట్రంలో 50 లక్షల టన్నుల ధాన్యం పండితే 2 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Last Updated : Apr 28, 2020, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details