ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నవరత్నాలు పేరుతో మోసం చేశారు: బొండా ఉమా - తెదేపా వార్తలు

నవరత్నాలు పేరుతో సీఎం జగన్ దగా చేశారని తెదేపా నేత బొండా ఉమా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ఏడాది పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదని అన్నారు.

tdp leader bonda uma fire on cm jagan
సీఎం జగన్ పై తెదేపా నేత విమర్శలు

By

Published : May 10, 2020, 12:13 AM IST

రాష్ట్రంలో అన్ని వ్యవ‌స్ధల‌ను జ‌గ‌న్ ప్రభుత్వం భ్రష్టు ప‌ట్టిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా దుయ్యబట్టారు. నవ‌ర‌త్నాలు అని ఊద‌రగొట్టిన వైకాపా... ఇప్పటికీ ఒక్క ర‌త్నం కూడా ఇవ్వలేదని విమర్శించారు. స్వాతంత్య్రం వ‌చ్చాక కాపుల‌కు కార్పోరేష‌న్ ఏర్పాటు చేసింది చంద్రబాబేనని గుర్తుచేశారు. కాపు సామాజిక‌వ‌ర్గాన్ని ఆదుకుంటామ‌ని అధికారంలోకి రాక‌ముందు జ‌గ‌న్ ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చారన్న బొండా ఉమా... అధికారంలోకి వ‌చ్చాక కాపుల‌కు వెయ్యి రూపాయ‌లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details