ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పిట్టకథలు చెప్పే మంత్రి గారూ... కేంద్ర నిధుల లెక్కలేవీ?' - బుగ్గనపై బోండా ఉమా కామెంట్స్

అన్నింటికీ ఏదో ఓ పిట్టకథ చెప్పే మంత్రి బుగ్గన ... కేంద్ర ఇచ్చిన నిధులపై ఎందుకు లెక్కలు చెప్పడంలేదని తెదేపా నేత బోండా ఉమా నిలదీశారు. కరోనా కట్టడి చేతకాకపోతే అధికాప పగ్గాలు చంద్రబాబుకు అప్పగించాలన్నారు. రివర్స్ టెండర్ల పాలన చేస్తున్న వైకాపా ర్యాపిడ్ కిట్లు కొనుగోలుకు అసలు టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.

తెదేపా నేత బోండా ఉమా
తెదేపా నేత బోండా ఉమా

By

Published : May 2, 2020, 5:47 PM IST

Updated : May 2, 2020, 6:25 PM IST

'పిట్టకథల చెప్పే మంత్రి గారూ... కేంద్ర నిధుల లెక్కలేవీ?'

పిట్ట కథలు చెప్పే ఆర్థిక మంత్రి బుగ్గన కేంద్రం నుంచి వచ్చిన నిధులపై లెక్కలు చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి బోండా ఉమా డిమాండ్ చేశారు. ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలం అవ్వడం వల్లనే దక్షిణాదిలో ఏపీ టాప్​లో ఉందని మండిపడ్డారు. పాలన చేతకాకపోతే చంద్రబాబు దగ్గర శిక్షణ తీసుకోవాలని హితవుపలికారు.

చంద్రబాబుకు పగ్గాలు ఇస్తే కరోనా కట్టడి చేసి చూపిస్తారని బోండా ఉమా సవాల్ విసిరారు. చంద్రబాబు ఖాళీగా కూర్చోకుండా...నిత్యం అధ్యయనం చేసి అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చెప్తున్న నిర్ధరణ పరీక్షలు సంఖ్య పూర్తిగా అసత్యమని ఆరోపించారు. అన్నింటికి రివర్స్ టెండర్లు అన్న ప్రభుత్వం కిట్ల కొనుగోలుకు అసలు టెండర్లే పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిట్ల కొనుగోలు విషయంలో మరిన్ని అక్రమాలు బయట పడతాయని బోండా అన్నారు.

ఇదీ చదవండి :ఫేస్ షీల్డ్.. కరోనా నుంచి మరింత రక్షణ ఇక మన సొంతం!

Last Updated : May 2, 2020, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details