ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి: బోండా ఉమా - పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి

Vangaveeti Mohanaranga: పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని.. తెదేపా నేత బోండా ఉమా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 9న విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేపట్టనున్నారు.

bonda uma demands to keep mohana ranga name for krishna
పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి: బోండా ఉమా

By

Published : Feb 8, 2022, 3:00 PM IST

Demand for Vangaveeti Mohana Ranga Name for District: పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని.. ఫిబ్రవరి 9న తేదేపా నేత బోండా ఉమా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన దీక్ష చేపట్టనున్నారు. పార్టీలకతీతంగా పశ్చిమ కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని.. దీక్ష చేపడుతున్నామని బోండా ఉమా తెలిపారు. రంగా పేరు పెట్టకపోతే ముఖ్యమంత్రి ఇంటిని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 26 జిల్లాల వల్ల కొత్తగా ఒక అటెండర్ ఉద్యోగం కూడా రాదని, కొత్త జిల్లాలకు మండల కేంద్రాలుగా వైకాపా నాయకులు చెప్పిన ప్రాంతాలనే పెడుతున్నారని ఆరోపించారు. తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలన్నారు. వంగవీటి మోహన రంగా పేరు జిల్లాకు పెట్టడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details