ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నమ్మి ఓటేస్తే.. వృద్ధులను నిండా ముంచిన జగన్: అయ్యన్నపాత్రుడు - AP LATEST NEWS

Ayyannapatrudu fires on CM Jagan: నమ్మి ఓటేసిన వృద్ధులను సీఎం జగన్ మోసగించారని.. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. పింఛ‌ను రూ.3వేలకు పెంచుతామ‌ని హామీ ఇచ్చి గద్దెనెక్కారని.. ఇప్పుడు నిండా ముంచారని ధ్వజమెత్తారు.

tdp leader ayyannapatrudu fires on cm jagan
నమ్మి ఓటేస్తే నిండా ముంచారు: అయ్యన్నపాత్రుడు

By

Published : Jan 1, 2022, 3:29 PM IST

Ayyannapatrudu fires on CM Jagan: నమ్మి ఓటేసిన వృద్ధులను సీఎం జగన్.. నిండా ముంచారని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. పింఛ‌ను రూ.3వేలకు పెంచుతామ‌ని హామీ ఇచ్చి గద్దెనెక్కారన్న ఆయన.. ఈ 32నెలల పాల‌న‌లో పెంచింది కేవలం రూ.250 మాత్రమేనని ఆన్నారు.

ప్రజాధ‌న‌మే కాకుండా.. నిరుపేద‌ల్ని దోచుకుంటున్న దోపిడీ దొంగ జ‌గ‌న్‌ అని విమర్శించారు. 60 ల‌క్షల మంది పింఛ‌ను ల‌బ్ధిదారుల్లో.. ఒక్కొక్కరి నుంచి రూ.750 చొప్పున ఇప్పటివ‌ర‌కూ రూ.14,400 కోట్లు కొట్టేశారని ఆరోపించారు.

ఈ నూత‌న సంవ‌త్సరంలోనైనా ఏ ఆస‌రాలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల్ని మోస‌గించ‌కుండా.. ముఖ్యమంత్రికి మంచిబుద్ధి ప్రసాదించాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నానని అయ్యన్నపాత్రుడు అన్నారు.

ఇదీ చదవండి:

CBN New Year Wishes: ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details