విశాఖ నుంచి వెలి వేయడంతో జగన్‌ను జైలుకి పంపడమే అజెండాగా విజయసాయిరెడ్డి దిల్లీలో తిరుగుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు దుయ్యబట్టారు. మోదీ, షా అపాయింట్మెంట్ అంటూ హడావుడి చేయడం, ముందురోజు జగన్ బాత్ రూంలో కాలు జారి పడటం వీసారెడ్డి మర్చిపోతే ఎలా అని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి మాటల్లో అసహనం కనిపిస్తోందని విమర్శించారు. వైజాగ్ నుంచి హెరాయిన్, గంజాయి డ్రగ్ డాన్ పూసాలు కదులుతున్నాయని, కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణలో డ్రగ్ గ్యాంగ్ త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమన్నారు.
AYYANNAPATHRUDU: 'విజయసాయిరెడ్డి మాటల్లో అసహనం కనిపిస్తోంది' - mp vijyasaireddy
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌ను జైలుకు పంపడమే అజెండాగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
![AYYANNAPATHRUDU: 'విజయసాయిరెడ్డి మాటల్లో అసహనం కనిపిస్తోంది' తెదేపా నేత అయ్యన్నపాత్రుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13477770-887-13477770-1635368960950.jpg)
తెదేపా నేత అయ్యన్నపాత్రుడు