ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీబీఐ విచారణ జరిపించకుంటే.. ఆధారాలు బయటపెడతాం: అయ్యన్నపాత్రుడు - అయ్యన్నపాత్రుడు తాజా వార్తలు

అవినీతి చేయడంలో సీఎం జగన్, అతనికి సలహాలు ఇవ్వడంలో విజయసాయి రెడ్డి ఘనులని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించకుంటే, తామే ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతామని హెచ్చరించారు.

tdp leader ayyanna patrudu fires on ycp government on house sites distribution
సీబీఐ విచారణ జరిపించకుంటే.. ఆధారాలు బయటపెడతాం: అయ్యన్నపాత్రుడు

By

Published : Dec 25, 2020, 7:45 PM IST

ఇళ్ల పట్టాల పంపిణీలో జరిగిన రూ.6వేల 500 కోట్ల రూపాయల అవినీతిపై సీబీఐ విచారణ జరిపించకుంటే, తామే ఆధారాలతో సహా ప్రజల ముందుపెడతామని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. అవినీతి చేయడంలో జగన్మోహన్ రెడ్డి , అతనికి సలహాలు ఇవ్వడంలో విజయసాయి రెడ్డి ఘనులని విమర్శించారు. ఎన్నికల ముందు అన్ని టిడ్కో ఇళ్లూ ఉచితమేనన్న జగన్..‌ ఇప్పుడు 300చదరపు అడుగులు మాత్రమే ఉచితమంటూ మాటమార్చారని దుయ్యబట్టారు.

ఇళ్ల కేటాయింపులోనూ మోసమే
ఎన్నికల ముందు అన్ని టిడ్కో ఇళ్లూ ఉచితమేనన్న సీఎం జగన్..‌ ఇప్పుడు 300చదరపు అడుగులు మాత్రమే ఉచితమంటూ మాటమార్చారు. తెదేపా హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన 8 లక్షల ఇళ్లు.. పేదలకు ఇచ్చేందుకు జగన్ ఇష్టపడటం లేదు. డిపాజిట్లు కట్టిన వాళ్లకి ఇళ్లు ఇవ్వకుండా లబ్ధిదారుల జాబితా నుంచి పేర్లు తొలగించాలని చూస్తున్నారు. దీనిపై ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details