వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది పాలన తర్వాత ప్రభుత్వాన్ని క్యాడర్ నుంచి లీడర్ వరకూ అంతా ఛీ కొడుతున్నారని అన్నారు. వైకాపా నేతలు ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట భూ కుంభకోణానికి తెర తీశారని ఆరోపించారు. ఈ కుంభకోణానికి విజయసాయిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని అయ్యన్న ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కోసం పార్లమెంటు సీటు త్యాగం చేసిన బాబాయి హత్య కేసులో ఉదాసీనత చూపారని ఆరోపించారు.
'ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట భూ కుంభకోణాలకు తెర తీశారు' - వైకాపా ప్రభుత్వంపై అయ్యన్న పాత్రుడు విమర్శల వార్తలు
వైకాపా ప్రభుత్వ పాలనను ప్రజల నుంచి నేతల వరకూ అందరూ ఛీ కొడుతున్నారని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ఇళ్ల స్థలాల పేరిట భూ కుంభకోణానికి తెరతీశారని ఆరోపించారు. వీటన్నింటికి కథ, కథనం, దర్శకత్వం విజయసాయిరెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అయ్యన్న పాత్రుడు, తెదేపా నేత
Last Updated : Jul 11, 2020, 12:40 PM IST