'జగన్ గొడ్డలి వేటుకు దొరక్కుండా, విదేశాలకు పారిపోయేందుకు దిల్లీ పెద్దల బంగళాల్లో దాక్కుంటూ.. ఎంపీ విజయసాయి రెడ్డి వీసా కోసం ప్రయత్నిస్తున్నారు' అని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. జగన్ సోదరుడు అనిల్‌రెడ్డి మద్యం మాఫియా కోసమే తాలిబన్ల నుంచి హెరాయిన్ తెప్పించాడని కేంద్ర దర్యాప్తు సంస్థలకు సాయిరెడ్డి ఉప్పందించారని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
అప్పటి నుంచి విజయసాయి విశాఖలో కనిపించకుండా.. దిల్లీ పెద్దల బంగళాల్లో దాక్కొంటున్నాడని ఎద్దేవా చేశారు. వివేకాకి గొడ్డలితో గుండెపోటు తెప్పించినట్టే.. సాయిరెడ్డికి గుండె నొప్పి వచ్చే అవకాశాలున్నాయని తాడేపల్లివర్గాల భోగట్టా అని విమర్శించారు.