రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టులో రూ.780 కోట్లు ఆదా చేశామని చెప్పిన సీఎం జగన్...ఇప్పుడు అంచనా వ్యయాన్ని రూ.3222 కోట్లకు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. దోపిడీ కోసమే పోలవరం కుడి కాలువపై రూ. 912 కోట్లతో ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ దండగన్న జగన్.. మరో ఎత్తిపోతల పథకానికి రూ. 912 కోట్లు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు.
వైకాపా ప్రభుత్వ హయంలో పోలవరం ఎంతపూర్తి చేశారో..,నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారో...ప్రజలందరికీ అర్థమయ్యేలా శ్వేతపత్రం విడుదల చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు.