ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NREGS: రూ.2 వేల కోట్ల ఉపాధి నిధులను పక్కదారి పట్టించారు: అయ్యన్నపాత్రుడు - ఉపాధిహామీ పనులపై అయ్యన్న కామెంట్స్

రూ. 2 వేల కోట్ల ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని తెదేపా నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. పక్కదారి పట్టిన నిధులను అధికారుల నుంచి వసూలు చేయాలని కేంద్రం ఆదేశించటం హర్షణీయమన్నారు.

అయ్యన్న
అయ్యన్న

By

Published : Oct 31, 2021, 2:02 PM IST

ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రూ.2 వేల కోట్ల ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించారన్నారు. ఉపాధి నిధుల చెల్లింపుపై కేంద్రం అభ్యంతరం తెలపడం శుభపరిణామన్నారు. పక్కదారి పట్టిన కేంద్ర వాటా నిధులను అధికారుల నుంచి వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించటం హర్షణీయమన్నారు. ఆ వ్యవహారంలో కేంద్రం చర్యలు తీసుకునేలా రాష్ట్ర భాజపా నాయకులు ఒత్తిడి తేవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details